International Flights Ban: దేశంలో ‘స్ట్రెయిన్’ వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జనవరి 31 వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై నిషేధం విధిస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.
ఇటీవలే యూకేకి విమాన సర్వీసులపై నిషేధం డిసెంబరు 31 వరకు ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశంలో ఈ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బ్రిటన్ నుంచి ఇండియాకు చేరుకున్న పలువురు భారతీయుల్లో కోవిడ్19 పాజిటివ్ లక్షణాలను గుర్తించినప్పటికీ వీరిలో కొందరికి మ్యుటెంట్ వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. ప్రాథమిక పరీక్షల అనంతరం 20 కేసుల్లో మ్యుటెంట్ వైరస్ లక్షణాల వైనం బయటపడింది. ఆరుగురు రోగుల్లో వీటిని గుర్తించామని సర్కార్ నిన్న తెలిపింది. 8 కేసులను ఢిల్లీ ల్యాబ్, 7 కేసులను బెంగుళూరు ల్యాబ్ నమోదు చేశాయి. అయితే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చునని ఆందోళన చెందుతున్నారు. నవంబరు 25, డిసెంబరు 23 మధ్య తేదీల్లో ఇండియాకు చేరుకున్న సుమారు 33 వేలమందికి టెస్టులు నిర్వహించారు. కాగా…. ఈ కొత్త మ్యుటెంట్ కరోనా వైరస్ ప్రమాదకరమైనదా, కాదా అన్నవిషయాన్ని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.
Govt of India extends suspension of scheduled commercial international flights till Jan 31, 2021; restrictions not to apply on special flights and international air cargo operations. #COVID19 pic.twitter.com/7tD5kl3tfZ
— ANI (@ANI) December 30, 2020
Also Read:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…
ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!