ఎప్పటి నుండో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. విమానయాన శాఖ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవల్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు అనుమతినిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
విమాన ప్రయాణంలో ఉన్నపుడు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, ఈ-రీడర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫ్లైట్ మోడ్ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి వాడుకోవచ్చు అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విమానాల్లో ఇంటర్నెట్ సేవల వినియోగంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘విమానంలో పైలట్-ఇన్-కమాండ్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు’ అని ప్రకటనలో పేర్కొంది. తద్వారా వై-ఫై సదుపాయంతో ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోను, ట్యాబ్లెట్, స్మార్ట్‌వాచ్, ఈ-రీడర్ వంటి పరికరాలను ఫ్లైట్ మోడ్ లేదా ఎయిరోప్లేన్ మోడ్‌లోనే ఉంచి వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా.. తమ కొత్త బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానంలో వైఫై సేవల్ని కల్పించి, ఈ ఘనత సాధించిన తొలి భారత విమానయాన సంస్థగా విస్టారా ఘనత దక్కించుకోనుంది.