bird flu : బర్డ్‌ ఫ్లూపై నివేదికలు రెడీ చేయండి.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

అన్ని రాష్ట్రాల వణ్యప్రాణుల విభాగాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే బర్డ్‌ఫ్లూపై నివేదికలు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది. భారత్‌లోని హిమాచల్‌...

bird flu :  బర్డ్‌ ఫ్లూపై నివేదికలు రెడీ చేయండి.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Updated on: Jan 06, 2021 | 1:02 AM

bird flu : అన్ని రాష్ట్రాల వణ్యప్రాణుల విభాగాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే బర్డ్‌ఫ్లూపై నివేదికలు సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశించింది. భారత్‌లోని హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

బర్డ్‌ఫ్లూను అన్ని రాష్ట్రాలు తీవ్రంగా పరిగణించి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలిపింది. బర్డ్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంగా ఉంచుకోవాలని కోరింది. వైరస్‌ వ్యాప్తిని అదుపులో ఉంచేందుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.  రాష్ట్రాల్లో పక్షుల మరణాలపై నివేదికలు అందజేయాలని ఆదేశించింది.

తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో 2,300 వలస పక్షులు బర్డ్‌ఫ్లూ బారిన పడి మరణించినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ ధ్రువీకరించింది. సుమారు 57వేల వలస పక్షులు వలస వచ్చినట్లు అంచనా వేస్తున్నామని వారు తెలిపారు. మరణించిన పక్షులను నిబంధనలకు అనుగుణంగా ఖననం చేస్తున్నామని వెల్లడించారు. కేరళలోని రెండు జిల్లాల్లో 40వేలకు పైగా బాతులు మృత్యువాత పడటంతో బర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా ప్రకటించి ఆ రెండు జిల్లాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్‌లో 15 రోజుల పాటు కోడిమాంసం, కోడిగుడ్ల దుకాణాలను మూసేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.