మీ మరణం తీరని లోటు: గిరీష్ మృతిపై సెలబ్రిటీల ట్వీట్లు

| Edited By:

Jun 10, 2019 | 1:33 PM

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను తలచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. నటుడు, రచయిత గిరీష్ ఆకస్మిక మరణం బాధించింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ Sad to hear of the passing of Girish Karnad, writer, actor and doyen of […]

మీ మరణం తీరని లోటు: గిరీష్ మృతిపై సెలబ్రిటీల ట్వీట్లు
Follow us on

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్ ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను తలచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.

నటుడు, రచయిత గిరీష్ ఆకస్మిక మరణం బాధించింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

అన్ని భాషలలో గొప్ప నటుడిగా గిరీష్ కర్నాడ్ గుర్తుండిపోతారు. ఆయన మరణం బాధించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని కోరుకుంటున్నా: నరేంద్ర మోదీ

రచయిత, నటుడు, దర్శకుడు.. అన్నింటికి మించి ఒక మంచి మనిషి. ఆయన మరణం భారత మాతకు తీరని లోటు. ఆయన కుటుంబం, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి: రాహుల్ గాంధీ

ఆయన కథలు నన్ను చాలా ఇన్ఫైర్ చేసేవి. ఎంతోమంది రచయితకు ఆయన అభిమాని. వారందరూ ఆయన వారసత్వాన్ని కాస్తైనా కొనసాగిస్తారని భావిస్తున్నా: కమల్ హాసన్

గిరీష్ కర్నాడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. రచయితగా, నటుడిగా, సామాజిక సమస్యలపై పోరాడే వ్యక్తిగా ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారు: కాంగ్రెస్

మీతో పాటు నేను గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తుంటుంది. మిమ్మల్ని మిస్ అవుతాను. కాని జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: ప్రకాశ్ రాజ్

మీ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. మీరు ఎప్పుడూ గుర్తుండిపోతారు: మోహన్ లాల్

మీ ఆత్మకు శాంతి కలగాలి గిరీష్ కర్నడ్ సార్: రవితేజ

వీరితో పాటు మరికొందరు ఆయన మృతిపై సానుభూతిని తెలుపుతున్నారు.