బీహార్ ఎన్నికల ఖర్చులపై నిఘా… కేంద్ర పరిశీలకుల నియామకం

|

Oct 04, 2020 | 4:00 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.

బీహార్ ఎన్నికల ఖర్చులపై నిఘా... కేంద్ర పరిశీలకుల నియామకం
Follow us on

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎన్నికల ఖర్చును అంచనా వేసేందుకు మధు మహాజన్, బీఆర్ బాలకృష్ణన్ లను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఉత్తర్వులను జారీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల్ని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధ్వర్యంలో ఇద్దరు వ్యయ పరిశీలకులను నియమించింది. ఎన్నికల నియమావళి ప్రకారం… రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు… ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలి. అసెంబ్లీకి పోటీచేస్తున్న అభ్యర్థుల ఖర్చులను ఇద్దరు అధికారులు పరిశీలిస్తారు. ఏరోజు కారోజు ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టిందీ లెక్కించి నివేదిక సిద్ధం చేస్తారు. ఎవరైనా అభ్యర్థి ఖర్చులు పెంచితే, వారి చర్యలు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.