తరగతి గదుల్లో కెమెరాలపై విచారణకు సుప్రీం ఆదేశం

ఢిల్లీ: ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు అమర్చడంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఆరు వారాల గడువునిచ్చింది. అన్ని తరగతి గదుల్లో కెమెరాలు అమర్చడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. సుమారు లక్షన్నర కెమెరాలు తరగతి గదుల్లో ఏర్పాటు చేసి వాటి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించడం సరికాదని పిటిషన్‌దారు కోర్టుకు తెలిపారు. ఇది విద్యార్థుల మానసిక స్థితిపై ఒత్తిడి కలగజేయడమే కాక, […]

తరగతి గదుల్లో కెమెరాలపై విచారణకు సుప్రీం ఆదేశం

Updated on: May 10, 2019 | 8:13 PM

ఢిల్లీ: ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు అమర్చడంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఆరు వారాల గడువునిచ్చింది. అన్ని తరగతి గదుల్లో కెమెరాలు అమర్చడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. సుమారు లక్షన్నర కెమెరాలు తరగతి గదుల్లో ఏర్పాటు చేసి వాటి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించడం సరికాదని పిటిషన్‌దారు కోర్టుకు తెలిపారు. ఇది విద్యార్థుల మానసిక స్థితిపై ఒత్తిడి కలగజేయడమే కాక, వారి గోప్యతకు భంగం కలిగించేలా ఉంటుందని వివరించారు.

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆరు వారాల్లోగా ఢిల్లీ ప్రభుత్వం స్పందించాలని ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.