గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ కలకలం రేపుతోంది. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టారు దుండగులు. దాచేపల్లి నడికుడిలోని బ్యాంకులోకి వెనుక వైపు గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దోపిడి దొంగలు లోపలికి చొరబడ్డారు. రావడంతోనే ముందుగా సీసీ కెమెరాలను టార్గెట్ చేసి..వాటిని పనిచెయ్యకుండా ఆపేశారు. ఆపై వచ్చిన పని కానిచ్చేసి రూ. 90 లక్షలతో చెక్కేశారు. తెల్లవారిన తర్వాత బ్యాంకుకు వచ్చిన ఉద్యోగులకు లోపలికి వెళ్లిన వెంటనే సీన్ అర్థమైంది. దోపిడీ జరిగినట్లుగా గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది నుంచి సమాచారం తెెలుసుకుని..స్పాట్‌లో ఆధారాలు సేకరించారు. బ్యాంక్ పరిసర ప్రాంతాలను, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. దోపిడి.. ఇంటి దొంగల పనా లేక బయట వ్యక్తుల పనా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. భారీ చోరీ కావడంతో కేసును సీరియస్‌గా తీసుకున్నారు.