విజయసాయిరెడ్డిపై కేసు నమోదు

తనపై తప్పుడు అభియోగాలు చేసి  బదిలీకి కారణమయ్యారంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  ఎస్పీ అడ్డాల వెంకటరత్నం శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సాయిరెడ్డిపై కేసు నమోదైంది. 30 సంవత్సరాలుగా నిజాయితీగా పని చేస్తున్నానని , ఒక్క ఫిర్యాదుతో తన పరువును తీశారని ఆయన ఆరోపించారు. ‘టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌ బంధువు ఈ నెల 18న విశాఖపట్నంలోని నారాయణ కళాశాల నుంచి రూ.50 కోట్లను వాహనంలో తరలిస్తుండగా… ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల […]

విజయసాయిరెడ్డిపై కేసు నమోదు
Follow us

|

Updated on: Mar 28, 2019 | 12:58 PM

తనపై తప్పుడు అభియోగాలు చేసి  బదిలీకి కారణమయ్యారంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  ఎస్పీ అడ్డాల వెంకటరత్నం శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సాయిరెడ్డిపై కేసు నమోదైంది. 30 సంవత్సరాలుగా నిజాయితీగా పని చేస్తున్నానని , ఒక్క ఫిర్యాదుతో తన పరువును తీశారని ఆయన ఆరోపించారు.

‘టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌ బంధువు ఈ నెల 18న విశాఖపట్నంలోని నారాయణ కళాశాల నుంచి రూ.50 కోట్లను వాహనంలో తరలిస్తుండగా… ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నేను ఆ వాహనానికి రక్షణ కల్పించి… ఆ నగదును నిర్దేశిత ప్రదేశాలకు చేర్చినట్లు విజయసాయిరెడ్డి నాపై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణ పూర్తి అవాస్తవం. ఈ నెల 18న రోజంతా జిల్లాలోని పోలీసులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించాను. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చించాను. ఆ రోజు ఎస్పీ కార్యాలయం నుంచి నేను బయటకు కదలలేదు. పైన పేర్కొన్న ఘటనకు సంబంధించి నాకు ఎలాంటి ఫోన్‌కాల్స్‌ కానీ, సమాచారం కానీ రాలేదు. వాస్తవంగా ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండటం పుంగిటవలస వద్ద డిప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌.గంగాభవానీ నేతృత్వంలోని స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందం ఓ కారును తనిఖీ చేయగా.. అందులో టీడీపీకి చెందిన ప్రచార సామాగ్రి లభించింది. తనిఖీ అనంతరం సామాగ్రిని స్వాధీనం చేసుకుని దాని విలువను అంచనా కట్టారు. దానికి సంబంధించి రూ.7 వేల ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయానికి కలిపారు. తన రోజువారీ నివేదికలో ఈ వివరాలను గంగాభవానీ ఎన్నికల సంఘానికి పంపించారు’ అని ఫిర్యాదులో వెంకటరత్నం పేర్కొన్నారు.