సూడాన్‌లో కుప్పకూలిన కార్గో విమానం.. 17 మంది మృతి

సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. 15 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు.

సూడాన్‌లో కుప్పకూలిన కార్గో విమానం.. 17 మంది మృతి

Updated on: Aug 23, 2020 | 11:01 AM

సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. 15 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని.. అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని జూబా సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి శనివారం ఉదయం ఈ విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎన్జీవోల కోసం డబ్బు, ఆహారం, వాహనాలు, స్పేర్ పార్ట్‌లను విమానం తీసుకెళ్తున్నట్టు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కుర్ కౌల్ పేర్కొన్నారు. విమానం గాల్లోకి వెళ్లిన కాసేపటికే కుప్పకూలినట్టు.. వెంటనే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఈ కార్గో విమానం సౌత్ వెస్ట్ ఏవియేషన్‌కు చెందినదిగా తెలుస్తోంది. కాగా.. విమానం కుప్పకూలిన సమయంలో డబ్బులు మొత్తం చెల్లాచెదురుగా పడ్డాయని.. ఇదే సమయంలో చుట్టు పక్కల ప్రజలు డబ్బుల కోసం ఎగబడ్డారని కుర్ కౌల్ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us