పశ్చమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తణుకు సమీపంలో అదుపుతప్పిన ఓ కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు పోలీసులు.
మృతి చెందిన వారిలో ఒకరు స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జీవన శేఖర్, ఆర్‌టీఓ ఆఫీస్‌లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, వెలుగు డిపార్ట్‌మెంట్ ఉద్యోగిని సుభాషిణిగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు భీమవరంకు చెందిన వారుగా తేలింది.
వీరు విధులకు హాజరుకావడానికి భీమవరం నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా వ్యవసాయ కాలువపై రోడ్డు చెడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికుల అంటున్నారు. ఉదయం సమయంలో అప్పటికే తడిసి ఉండటం.. కాలువులో వరద ప్రవామం అధికంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.