అతి వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి బోల్తా, క్షణాల్లో చెలరేగిన మంటలు, అదృష్టవశాత్తూ బయటపడ్డ భార్యాభర్తలు

అతివేగం ప్రాణాలమీదకొచ్చింది. కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ్‌. కారులో ఉన్న భార్యభర్తలిద్దరూ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు...

అతి వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి బోల్తా, క్షణాల్లో చెలరేగిన మంటలు, అదృష్టవశాత్తూ బయటపడ్డ భార్యాభర్తలు

Updated on: Jan 02, 2021 | 7:07 PM

అతివేగం ప్రాణాలమీదకొచ్చింది. కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ్‌. కారులో ఉన్న భార్యభర్తలిద్దరూ స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి చెన్నై వెళ్తున్న సదరు దంపతుల కారు,  గుండ్లకట్టమంచి దగ్గర అదుపుతప్పింది. బోల్తాపడ్డంతో కారు అంతా హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ బోల్తాపడిన కారులోంచి భార్యభర్తలు ఇద్దరూ వెంటనే బయటకు రాగలగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉన్నఫళంగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్థమైంది. ప్రాణాలతో బయటపడిన దంపతులను పోలీసులు ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.