కస్టమర్లకు గుడ్ న్యూస్.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు ఇవే..

| Edited By:

Jun 07, 2020 | 3:25 PM

ప్రామాణిక రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. తన రెపో లింక్డ్ లోన్ రేట్ (RLLR)ను 6.90 శాతానికి తగ్గించింది. నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను

కస్టమర్లకు గుడ్ న్యూస్.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు ఇవే..
Follow us on

ప్రామాణిక రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రకటించింది. తన రెపో లింక్డ్ లోన్ రేట్ (RLLR)ను 6.90 శాతానికి తగ్గించింది. నిధుల సేకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.20 శాతం తగ్గించింది. తాజా సవరణతో ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ 7.65 శాతానికి జారుకుంది. రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)కు సైతం 0.40 శాతం కోత పెట్టింది. దాంతో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.30 శాతం నుంచి 6.90 శాతానికి దిగివచ్చింది. ఈ నెల 7 నుంచి తగ్గించిన రేట్లు అమలులోకి వస్తాయి.

ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పటి నుంచి, బ్యాంకులు రుణ రేట్లను నిరంతరం తగ్గిస్తున్నాయి. ఈ రుణ రేట్లు అన్ని కొత్త రిటైల్ రుణాలు (గృహ, విద్య, ఆటో), సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (MSME) లకు ఇచ్చే రుణాలకు వర్తిస్తాయి. ఇటీవల, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్ (UCO BANK)రెపోకు సంబంధించిన రుణాలపై వడ్డీ రేట్లను 0.40 శాతం తగ్గించాయి.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..