ఇక శాస్త్రవేత్తలు కూడా సెలబ్రిటీలే: ఆనంద్ మహీంద్రా
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయాన్ని చూసి దేశం పులకించిపోయింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్తుంటే యావత్ భారతం కళ్లార్పకుండా చూసింది. శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయానికి అభినందనలు వెల్లువెతుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇస్రోను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా, చంద్రయాన్-2 విజయంపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరినొకరు హగ్ చేసుకోవడాన్ని చూసేందుకు ఊపిరి బిగబట్టి ఎదురుచూశానని […]

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయాన్ని చూసి దేశం పులకించిపోయింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్తుంటే యావత్ భారతం కళ్లార్పకుండా చూసింది. శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయానికి అభినందనలు వెల్లువెతుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇస్రోను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
తాజాగా, చంద్రయాన్-2 విజయంపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరినొకరు హగ్ చేసుకోవడాన్ని చూసేందుకు ఊపిరి బిగబట్టి ఎదురుచూశానని ట్వీట్ చేశారు. శాస్త్రవేత్తలకు తాను నిలబడి శాల్యూట్ చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు మన కొత్త సెలబ్రిటీలు వారేనని కొనియాడారు. ఈ ప్రయోగం మన క్రయోజనిక్ సాంకేతిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు. అంతేకాదు, టెక్నాలాజికల్ బ్రేక్ త్రూగా దీనిని అభివర్ణించారు.
Was waiting to see the @isro folks hug each other before breathing normally again! Validation of our cryogenic tech is a technological breakthrough. It will enable us to make many more moon missions. I stand & salute our scientists. They are deservedly our new celebrities ?? https://t.co/O0QC0CYkQn
— anand mahindra (@anandmahindra) July 22, 2019