అన్​లాక్ 2.0 అమలు తీరుపై కేంద్రం రివ్యూ…

|

Jul 05, 2020 | 11:05 AM

దేశంలో కరోనా వ్యాప్తి ఆగ‌డం లేదు. కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అన్ లాక్ 2.ఓ అమలు తీరును సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ రివ్యూ చేసింది.

అన్​లాక్ 2.0 అమలు తీరుపై కేంద్రం రివ్యూ...
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి ఆగ‌డం లేదు. కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అన్ లాక్ 2.ఓ అమలు తీరును సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ రివ్యూ చేసింది. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో శనివారం.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చ‌ర్చ‌లు జ‌రిపారు. రెండో విడత సడలింపుల్లో భాగంగా ఇంకా ఏయే అంశాలు పునరుద్ధరించొచ్చే ఆరా తీశారు. కరోనా కట్టడికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందేనని అధికారులందరూ అభిప్రాయపడినట్లు స‌మాచారం.

అనుమ‌తులు ల‌భించిన ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించకుండా, సాధారణ జీవనం సాఫీగా సాగిపోనివ్వాల‌ని రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించారు. ఎమ‌ర్జెన్సీ ప‌నుల‌కు మినహా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యథావిధిగా కర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఇక‌ మెట్రో ట్రైన్స్, థియేట‌ర్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, పార్కుల మూసివేత కొనసాగించనున్నారు.