
హైదరాబాద్ చైతన్యపురి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకువచ్చిన క్యాబ్.. డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అయితే, అదృష్టవశాత్తూ కారులో ఉన్న యువకులకు స్వల్ప గాయాలు కావడంతో.. కారు అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పక్కకి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంకు గురైన కారు డ్రైవేజీ క్యాబ్(TS07UH8486) గా గుర్తించారు.