Union Budget on February 1: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం సమావేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. లోక్‌సభ మొదటి విడత సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా జనవరి 29న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 29 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు తొలివిడత సమావేశాలు జరగనుండగా.. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, ఫిబ్రవరి 1న ఉదయం ఈ ఏడాది బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. అయితే చివరిసారిగా సెప్టెంబరులో వర్షాకాల సమావేశాలు ఏడు రోజులపాటే జరిగాయి. కరోనావైరస్ కారణంగా ఆ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలపైన ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Read Also… భారత ప్రజాస్వామ్య వైభవం ప్రతిభింబించేలా రాజ్యాంగ మందిరం.. ఇవాళ్టి నుంచి భవన నిర్మాణం పనులు షురూ