మాయావ‌తి సంచలన నిర్ణయం.. లొక్‌సభ పోటీకి దూరం

| Edited By:

Mar 20, 2019 | 3:11 PM

లక్నో : బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయావ‌తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న మాయావతి.. రానున్న రోజుల్లో కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. కలిసివస్తే మాయావతి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి సందర్భంలో లోక్‌సభ ఎన్నికల బరిలో నుంచి మాయావతి తప్పుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగామారింది. ఉత్తరప్రదేశ్‌కు […]

మాయావ‌తి సంచలన నిర్ణయం.. లొక్‌సభ పోటీకి దూరం
Follow us on

లక్నో : బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయావ‌తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న మాయావతి.. రానున్న రోజుల్లో కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారు. కలిసివస్తే మాయావతి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి సందర్భంలో లోక్‌సభ ఎన్నికల బరిలో నుంచి మాయావతి తప్పుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగామారింది.

ఉత్తరప్రదేశ్‌కు మాయావతి ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా చేశారు. అయితే గత ఎన్నికల్లోనే కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న ఆమెకు లోక్‌సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. కాంగ్రెస్, బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఓట్లు సంపాదించుకున్న పార్టీగా బీఎస్‌పీ నిలిచినప్పటికీ.. ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. కాగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీజేపీకి మెజారిటీ రాకపోతే మాయావతి ప్రధానమంత్రి అవ్వొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి.