ఫిరోజ్ షా కోట్ల మైదానంలో దివంగత అరుణ్ జైట్లీ విగ్రహం ఏర్పాటుపై తప్పుబట్టిన మాజీ క్రికెటర్..
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రేక్షకుల స్టాండ్‌కు ఉన్న తన పేరును తొలిగించాలంటూ లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి...
Bring Down My Name Says Bedi: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రేక్షకుల స్టాండ్‌కు ఉన్న తన పేరును తొలిగించాలంటూ లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, దివంగత రాజకీయ నాయకుడు అరుణ్ జైట్లీ విగ్రహాన్ని నిర్మించాలని డీడీసీఏ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో బిషన్ బేడీ ఈ మేరకు లేఖ రాయడం సంచలనంగా మారింది.
డీడీసీఏ ప్రెసిడెంట్‌గా దివంగత అరుణ్ జైట్లీ ఉన్న సమయంలో భారీ అవినీతి కుంభకోణం జరిగిందని.. ఇది గూగుల్‌లో సెర్చ్ ద్వారా కూడా తెలుస్తుందని బిషన్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిన కేసులు ఇప్పటికీ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సంగతి మీకు తెలిసే ఉంటుందని నమ్ముతున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు. దివంగత అరుణ్ జైట్లీ సమర్ధుడైన రాజకీయ నాయకుడే గానీ.. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పట్ల ఆయన శ్రద్ధ సందేహాస్పదంగా ఉండేదని తెలిపారు.
అరుణ్ జైట్లీ చనిపోయిన అనంతరం ఆయన పేరును కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు పెట్టినప్పుడు నేను మద్దతు తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఫిరోజ్ షా కోట్లలో ఏర్పాటు చేయనున్నట్లు డీడీసీఏ నిర్ణయం తీసుకుందని తెలిసి షాక్‌కు గురయ్యాను. నేను ఏం జరగకూడదు అనుకున్నానో అవే జరుగుతున్నాయి. అందుకే మిస్టర్ ప్రెసిడెంట్ ప్రేక్షకుల స్టాండ్‌కు ఉన్న నా పేరును తక్షణమే తొలగించండి. అలాగే, నేను నా DDCA సభ్యత్వాన్ని త్యజిస్తున్నాను. నాకు లభించిన గౌరవాన్ని నేను విస్మరించే అవకాశం లేదు. నాకు తోడుగా ఉన్నందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ బిషన్ సింగ్ బేడీ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read:
‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!
ఆన్‌లైన్ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!