ప్రయివేటీకరణ నేపథ్యంలో.. ఉద్యోగులకు బీపీసీఎల్‌ ఆఫర్..!

దేశంలోని రెండవ అతిపెద్ద ఇంధన రిటైలర్‌, మూడవ అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటె డ్ ‌(బీపీసీఎల్‌)సంస్థ స్వచ్చంద విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌‌) రాజధాని ఢిల్లీలో

ప్రయివేటీకరణ నేపథ్యంలో.. ఉద్యోగులకు బీపీసీఎల్‌ ఆఫర్..!

Edited By:

Updated on: Jul 26, 2020 | 5:29 PM

దేశంలోని రెండవ అతిపెద్ద ఇంధన రిటైలర్‌, మూడవ అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటె డ్ ‌(బీపీసీఎల్‌) సంస్థ స్వచ్చంద విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌‌) రాజధాని ఢిల్లీలో అమలు చేయనుంది. అయితే వీఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ఉద్యోగులు వినియోగించుకునేందుకు దరఖాస్తు ప్రక్రియ జులై 23న ప్రారంభమయి ఆగస్ట్‌ 13న పూర్తవుతుందని సంస్థ తెలిపింది. అయితే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌ను 52శాతం ప్రయివేటీకరణ చేయనుంది.

ప్రభుత్వం బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. ప్రస్తుతం సంస్థలో 20,000మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కాగా 45ఏళ్లు దాటిన ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ స్కీమ్‌కు అర్హులుగా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రయివేట్‌ యాజమాన్యం నేతృత్వంలో ఉద్యోగం చేయడానికి ఇష్టం లేనివారు వీఆర్‌ఎస్‌ స్కీమ్‌ను వినియోగించుకోవచ్చని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, వీఆర్‌ఎస్‌ తీసుకునే ఉద్యోగులు కంపెనీలో ఎలాంటి పదవి చేపట్టడానికి అనర్హులని తెలిపింది. బీపీసీఎల్‌ ప్రయివేటీకరణ ద్వారా 2లక్షల కోట్ల టార్గెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆశిస్తున్న విషయం తెలిసిందే.