Parakram Diwas: ఇకపై ‘పరాక్రమ్‌ దివస్‌’గా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి.. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం..

|

Jan 19, 2021 | 1:56 PM

Bose’s Birthday To Be Celebrated As: స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి (జనవరి 23)ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఏడాది నుంచి..

Parakram Diwas: ఇకపై పరాక్రమ్‌ దివస్‌గా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి.. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం..
Follow us on

Bose’s Birthday To Be Celebrated As: స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి (జనవరి 23)ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఏడాది నుంచి నేతాజీ జయంతిని ‘పరాక్రమ్‌ దివస్‌’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 23న నేతాజీ 125వ జ‌యంతిని ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 1897, జ‌న‌వ‌రి 23న ఒడిశాలోని క‌ట‌క్‌లో జ‌న్మించారు. బ్రిటీషర్లపై పోరాటం చేయడానికి తనదైన పంథాను ఎంచుకున్న నేతాజీ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి పోరాటం చేశారు. అయితే నేతాజీ ఓ విమాన ప్రమాదంలో మరణించారని, లేదు ఆ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకుని కొన్ని రోజులు ఆజ్ఙాతంలో ఉన్నారనే వాదనలు కొన్ని రోజుల వరకు నడిచాయి. అయితే 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని 2017లో ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు బదిలిస్తూ సమాధానమిచ్చారు.

Also Read: SBI PO Prelims Result : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అభ్యర్థులు రిజల్ట్ ఏవిధంగా తెలుసుకోవాలంటే..