ఇంటి దగ్గరకే అయ్యప్పస్వామి ప్రసాదం

|

Nov 10, 2020 | 2:28 PM

కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్పస్వామిని దర్శనభాగ్యం కోసం పరితపించే భక్తులు ఎందరో! నియమనిష్టలతో స్వామివారి సన్నిధానానికి వెళుతుంటారు..

ఇంటి దగ్గరకే  అయ్యప్పస్వామి ప్రసాదం
Follow us on

కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్పస్వామిని దర్శనభాగ్యం కోసం పరితపించే భక్తులు ఎందరో! నియమనిష్టలతో స్వామివారి సన్నిధానానికి వెళుతుంటారు.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో భక్తుల సంఖ్యను పరిమితం చేశారు కానీ లేకపోతే వేలాది మంది శబరిమలకు వెళ్లేవారు. ప్రతి రోజు వెయ్యి మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక తీర్థ ప్రసాదాలపై కూడా ఆంక్షలు పెట్టారు నిర్వాహకులు.. అయితే ఇకపై అయ్యప్పస్వామి దివ్యప్రసాదం కోసం అంత దూరం వెళ్లనక్కర్లేదు.. ప్రసాదాన్ని కోరుకున్న భక్తులకు వారి ఇంటి దగ్గరే, అది కూడా మూడు రోజుల్లోగా అందచేయాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
ఇందుకోసం పోస్టాఫీసులో 450 రూపాయలు చెల్లించాలి. ఇప్పటికే బుక్‌ చేసుకున్నవారికి ఈ నెల 16 నుంచి కిట్‌లు అందచేస్తారు.. ఈ కిట్‌లో ప్రసాదంతో పాటు పసుపు కుంకుమ, విభూతి, నెయ్యి ఉంటాయి..