‘శ్రీకృష్ణజన్మ భూమి ట్రస్ట్’ పేరిట ఛీటింగ్, 13 మంది అరెస్ట్

| Edited By: Anil kumar poka

Aug 22, 2020 | 11:31 AM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రామజన్మ భూమి ట్రస్ట్ పేరిట ట్రస్ట్ ఏర్పడినట్టే మధురలో కూడా శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరిట ఓ సంస్థ 'వెలసింది'. అయితే ఇది బోగస్ ట్రస్ట్ అని, ఈ సంస్థ సభ్యుల్లో ఓ 'స్వామీజీ'(?) కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు..

శ్రీకృష్ణజన్మ భూమి ట్రస్ట్ పేరిట ఛీటింగ్, 13 మంది అరెస్ట్
Follow us on

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రామజన్మ భూమి ట్రస్ట్ పేరిట ట్రస్ట్ ఏర్పడినట్టే మధురలో కూడా శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరిట ఓ సంస్థ ‘వెలసింది’. అయితే ఇది బోగస్ ట్రస్ట్ అని, ఈ సంస్థ సభ్యుల్లో ఓ ‘స్వామీజీ'(?) కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ట్రస్ట్ పేరిట ప్రజలనుంచి డబ్బులను గుంజడానికి దీన్ని ఏర్పాటు చేశారని వారు చెప్పారు. మధురలోని అసలైన శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి కపిల్ శర్మ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు ఈ నకిలీ ట్రస్ట్ సభ్యులను అరెస్టు చేశారు.   వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

తమ ట్రస్ట్ 1944 నుంచే మధురలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అయితే  ఈ విధమైన బోగస్ ట్రస్టులను నమ్మరాదని కపిల్ శర్మ కోరుతున్నారు.