మంటల్లో చిక్కుకుని పులి పిల్లలు మృతి
పూణె: ఓ చెరుకుతోటలో 5 చిరుత పులి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూణేలోని జూనార్‌లో ఆవసారీ గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆవసారీ గ్రామంలో ఒకరి పొలంలో చెరకు పంట కోయడానికి కూలీలు వచ్చారు. పంటకోయగా కొంత చెత్త పోగుపడింది. అనంతరం పొలం యజమాని చెప్పినట్టుగా పోగుపడిన చెరకు చెత్తకు నిప్పుపెట్టారు. ఆ చెత్త మాటున పులిపిల్లలు ఉన్నట్లు వారు […]
పూణె: ఓ చెరుకుతోటలో 5 చిరుత పులి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూణేలోని జూనార్‌లో ఆవసారీ గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఆవసారీ గ్రామంలో ఒకరి పొలంలో చెరకు పంట కోయడానికి కూలీలు వచ్చారు. పంటకోయగా కొంత చెత్త పోగుపడింది. అనంతరం పొలం యజమాని చెప్పినట్టుగా పోగుపడిన చెరకు చెత్తకు నిప్పుపెట్టారు. ఆ చెత్త మాటున పులిపిల్లలు ఉన్నట్లు వారు గమనించలేదు. కొంతసేపటికి వారిలో ఒక మహిళ ఆ పులిపిల్లల్ని గమనించి బయటకు తీసింది. అప్పటికే పులిపిల్లలు మంటల వేడికి చనిపోయాయి. అటవీశాఖ అధికారులు పులిపిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.