ఇయ‌ర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా..?

| Edited By:

May 25, 2020 | 6:25 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువయింది.

ఇయ‌ర్ ఫోన్స్ అతిగా వాడుతున్నారా..?
Follow us on

prolonged use of earphones: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువయింది. అయితే.. ఇయ‌ర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడ‌ద‌న్న‌ది నిపుణుల మాట. వీటిని అధికంగా వాడ‌టం వ‌ల్ల వినికిడి స‌మ‌స్యలు తలెత్తే అవ‌కాశం ఉంది. ఇక వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్స్ వ‌ల్ల రేడియేష‌న్‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. తాజాగా ఇయ‌ర్ ఫోన్స్ ఎక్కువ‌గా వాడినందుకు ఓ బాలుడు ఆస్ప‌త్రిపాలయ్యాడు.

వివరాల్లోకెళితే.. చైనాలోని బీజింగ్‌కు చెందిన ప‌దేళ్ల బాలుడు చెవి నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌ను ఆస్ప‌త్రికి వెళ్ల‌గా, అత‌డిని ప‌రీక్షించిన వైద్యులు షాక్‌కు గుర‌య్యారు. చెవిలో ద‌ట్టంగా పెద్ద స‌మూహంలో శిలీంధ్రాలు పెరుగుతున్న‌ట్లు గుర్తించారు. దీన్ని ‘బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగ‌స్’‌గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వ‌ల్ల‌ ప్ర‌స్తుతం అత‌డు పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డాడ‌ని తెలిపారు.

కాగా.. సంబంధిత ఫొటోల‌ను డా.వు యుహువా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయ‌ర్ ఫోన్స్ విచ్చ‌ల‌విడిగా వాడ‌టం వ‌ల్లే ఇంత ఘోరం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చాడు. కాబ‌ట్టి వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్‌, హెడ్‌ఫోన్స్ వాడకందారులు దాని ప‌ర్య‌వ‌సానాల‌ను తెలుసుకుని ప‌రిమితంగా వినియోగించాల‌ని హెచ్చ‌రించారు. ఇయ‌ర్‌ ఫోన్స్ వినియోగ‌దారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచడమే కాక‌, దాన్ని వాడే గంట‌ల‌ను త‌గ్గించాల‌ని సూచించారు.