అక్ర‌మ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు పోలీసులు..

మ‌ద్యం అక్ర‌మ రవాణా చేస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డంగా బుక్క‌య్యారు. కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో స్టేట్ బోర్డ‌ర్ జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండ‌గా..లిక్క‌ర్ బాటిల్స్ తో ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. ఒకరు విజయవాడ జీఆర్పీలో డిప్యూటేషన్​లో వ‌ర్క్ చేస్తోన్న‌ ఏఆర్‌ కానిస్టేబుల్ శివరామకృష్ణగా ఐడెంటిఫై చేశారు. మరొకరు ఇబ్రహీంపట్నం పీఎస్ కానిస్టేబుల్ గుంటి నాగేశ్వరరావు అని వెల్ల‌డించారు. వీరి వద్ద నుంచి దాదాపు 400 వందల క్వార్టర్​ బాటిల్స్, 20 ఫుల్ బాటిల్స్ […]

అక్ర‌మ మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు పోలీసులు..

మ‌ద్యం అక్ర‌మ రవాణా చేస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డంగా బుక్క‌య్యారు. కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో స్టేట్ బోర్డ‌ర్ జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండ‌గా..లిక్క‌ర్ బాటిల్స్ తో ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. ఒకరు విజయవాడ జీఆర్పీలో డిప్యూటేషన్​లో వ‌ర్క్ చేస్తోన్న‌ ఏఆర్‌ కానిస్టేబుల్ శివరామకృష్ణగా ఐడెంటిఫై చేశారు. మరొకరు ఇబ్రహీంపట్నం పీఎస్ కానిస్టేబుల్ గుంటి నాగేశ్వరరావు అని వెల్ల‌డించారు.

వీరి వద్ద నుంచి దాదాపు 400 వందల క్వార్టర్​ బాటిల్స్, 20 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు కానిస్టేబుల్స్ పై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని డీఎస్పీ రమణమూర్తి వెల్ల‌డించారు. ఆంధ్రాలో అక్ర‌మ‌ మద్యం అమ్మేందుకు సహకరిస్తున్న తెలంగాణ మద్యం షాపులపై కూడా చర్యలు తీసుకునేలా రిపోర్టు తయారు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కాగా అక్ర‌మాలు జ‌రగ‌కుండా చూడాల్సిన పోలీసులే ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండంతో సామాన్యులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.