అమేథిలో ఆధిక్యం దిశగా స్మృతి!

| Edited By:

May 23, 2019 | 2:44 PM

ఉత్తరప్రదేశ్‌లోని అమెథిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలోని ఎన్నో స్థానాలపై ఇప్పటికే గెలుపు గురించి ఓ అంచనా వచ్చినప్పటికీ, అమెథీలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి రౌండ్ లెక్కింపు అయ్యే వరకు స్మృతి రాహుల్ పై 11,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో 2004 నుంచి రాహుల్ గాంధీయే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. కాగా 2014లో రాహుల్‌పై స్మృతి ఇరానీ […]

అమేథిలో ఆధిక్యం దిశగా స్మృతి!
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని అమెథిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలోని ఎన్నో స్థానాలపై ఇప్పటికే గెలుపు గురించి ఓ అంచనా వచ్చినప్పటికీ, అమెథీలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి రౌండ్ లెక్కింపు అయ్యే వరకు స్మృతి రాహుల్ పై 11,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఈ స్థానంలో 2004 నుంచి రాహుల్ గాంధీయే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. కాగా 2014లో రాహుల్‌పై స్మృతి ఇరానీ తొలిసారి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో రాహుల్ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో అమెథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. ఈ ప్రభావం అమెథీపై పడి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.