ఎన్నికల ఖర్చు 60వేల కోట్లు… అందులో బీజేపీది 45 శాతం

| Edited By:

Jun 04, 2019 | 7:28 PM

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యంత ఖరీదైనది. ఈ మధ్య ముగిసిన ఎన్నికల్లో పెట్టిన ఖర్చే దీనికి ఉదాహరణ అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అనే సంస్థ . ఈ సంస్థ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈమధ్య ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ 60వేల కోట్లు (8.7బిలియన్‌ డాలర్లు) 2014 సార్వత్రిక ఎన్నికలకు ఇది రెట్టింపు. ‘ఈ 60వేల కోట్లలో 15-20 శాతం ఎలక్షన్‌ కమిషన్‌ […]

ఎన్నికల ఖర్చు 60వేల కోట్లు... అందులో బీజేపీది 45 శాతం
Follow us on

భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యంత ఖరీదైనది. ఈ మధ్య ముగిసిన ఎన్నికల్లో పెట్టిన ఖర్చే దీనికి ఉదాహరణ అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అనే సంస్థ . ఈ సంస్థ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈమధ్య ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ 60వేల కోట్లు (8.7బిలియన్‌ డాలర్లు) 2014 సార్వత్రిక ఎన్నికలకు ఇది రెట్టింపు. ‘ఈ 60వేల కోట్లలో 15-20 శాతం ఎలక్షన్‌ కమిషన్‌ చేసిన వ్యయమే. సగటున ఒక్కో నియోజకవర్గంలో రూ 100 కోట్ల మేర ఖర్చు జరిగింది. సగటున ఒక్కో ఓటరుపై పెట్టిన ఖర్చు రూ 700. ఎన్నికల నిర్వహణ, పార్టీలు ప్రచారం నిమిత్తం చేసిన వ్యయం, ఇతరత్రా ప్రలోభాలూ… వీటన్నింటినీ లెక్కవేస్తే ఇంత మొత్తం తేలింది’’ అని సీఎంఎస్‌ ఓ నివేదికలో తెలిపింది.

ఈ ఎన్నికల కోసం అధికార బీజేపీ పార్టీ ఏకంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం అయిన ఖర్చులో బీజేపీ మాత్రమే 45 శాతం ఖర్చు చేసిందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ… మన దేశంలో ఎన్నికలంటే పూర్తీగా డబ్బుతో ముడిపడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలూ చేసే ఖర్చుకి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై పారదర్శకత ఉండాలని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత్‌లోని రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో కార్పొరేట్లు, విదేశాల నుంచి నిధులు అక్రమంగా అందుతున్నాయని అన్నారు.