‘సౌదీకి వెళ్లి వచ్చా..సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నా..’ సురేష్ ప్రభు .

సౌదీ అరేబియాకు వెళ్లి తిరిగి వఛ్చిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తన నివాసంలో 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నట్టు తెలిపారు.

సౌదీకి వెళ్లి వచ్చా..సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నా.. సురేష్ ప్రభు .

Edited By:

Updated on: Mar 18, 2020 | 1:38 PM

సౌదీ అరేబియాకు వెళ్లి తిరిగి వఛ్చిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తన నివాసంలో 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నట్టు తెలిపారు. కరోనా టెస్టుల్లో తనకు నెగెటివ్ అని వఛ్చినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో షెర్పాల సమావేశానికి హాజరయ్యేందుకు సురేష్ ప్రభు గతవారం సౌదీకి వెళ్లారు.  ఆ దేశంలో ఇప్పటివరకు 171 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఐసొలేషన్ కాల పరిమితి ముగిసేవరకు తాను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేనని సురేష్ ప్రభు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో తెలిపారు. ఎంపీలు, పార్లమెంట్ స్టాఫ్, ఇతర విజిటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నా అని ఆయన వెల్లడించారు. కాగా .. ఇండియాలో సుమారు 147 కరోనా కేసులు నమోదు  కాగా.. ముగ్గురు రోగులు మరణించారు.

 

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us