కేంద్రాన్ని హెచ్చరించిన సుజనా చౌదరి.!

|

Sep 19, 2020 | 6:34 PM

దేశంలో తాగునీటి సమస్య అంతకంతకూ పెరుగిపోతోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సత్వరమే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీతి ఆయోగ్ అధ్యయనం..

కేంద్రాన్ని హెచ్చరించిన సుజనా చౌదరి.!
Follow us on

దేశంలో తాగునీటి సమస్య అంతకంతకూ పెరుగిపోతోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని సత్వరమే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం దేశంలో నీటి లభ్యత బాగా తగ్గిపోతుందని ఆయన కేంద్రంకు వివరించే ప్రయత్నం చేశారు. 2011 లో ప్రతి వ్యక్తికి నీటి లభ్యత 1544 క్యూబిక్ మీటర్లు ఉంటే, 2025 నాటికి 1465 క్యూబిక్ మీటర్లకు పడిపోతుందని అంచనాగా ఉందని సుజనా పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు నీటి సరఫరా సౌకర్యం ఉన్న ఒక్క నగరం కూడా లేదని ఆయన అన్నారు. నిర్ధిష్ట కాల పరిమితితో సత్వర చర్యలు తీసుకోకపోతే అనేక తత్సంబంధిత సమస్యలను దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని సుజనా హెచ్చరించారు. అపరిశుభ్రత వల్ల వచ్చే అనారోగ్యాలు, తాగునీటి కొరకు జగడాలు, ఆహార భద్రత, వాతావరణ మార్పులు వంటి పలు సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తాయని ఎంపీ పార్లమెంట్ జీరో అవర్లో పేర్కొన్నారు. వెనువెంటనే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.