ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా: కన్నా లక్ష్మీ నారాయణ

| Edited By:

Dec 21, 2019 | 6:10 PM

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే కులం, మతం తప్ప ఇంకేమి ఉండదని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాజధాని పై చర్చ సమయంలో అసెంబ్లీ లో ‘అమరావతి లో రాజధాని’ అనేది జగన్ కూడా‌ ఒప్పుకున్నాడు అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని సెలవిచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ,‌ కోస్తాంధ్ర లాంటి ప్రాంతాల్లో అబివృద్ధి […]

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా: కన్నా లక్ష్మీ నారాయణ
Follow us on

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే కులం, మతం తప్ప ఇంకేమి ఉండదని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాజధాని పై చర్చ సమయంలో అసెంబ్లీ లో ‘అమరావతి లో రాజధాని’ అనేది జగన్ కూడా‌ ఒప్పుకున్నాడు అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని సెలవిచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ,‌ కోస్తాంధ్ర లాంటి ప్రాంతాల్లో అబివృద్ధి వికేంద్రీకరణ‌ ఉండాలని కోరాం..పాలన వికేంద్రీకరణ‌ కోరలేదు అని కన్నా స్పష్టంచేశారు. పార్టీలో ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతమే ….పార్టీ మాట కాదు అని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఒకటే ఉందా…అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా అని తీవ్రంగా మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు ఇదే తప్పు చేసి వెళ్ళిపోయాడు…ఏపీ ఏమన్నా మీ సొంత‌ జాగీరా జగన్ నియంతృత్వ పోకడలను బీజేపీ వ్యతిరేకిస్తుంది. రాజధానికి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలని విన్నవించారు. అమరావతి లో ఆందోళన చేస్తున్న రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలి, వారికి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు అని కన్నా తెలిపారు. రాజధానికి కేంద్రం 2,500 కోట్లు ఇచ్చింది…ఇప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం ఎలా చేస్తారు 2014 విభజన చట్టం ప్రకారం కేంద్రం నిధులివ్వాల్సి ఉంది, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది, జగన్ తో అభివృద్ది జరుగుతుందని అనిపించడం లేదు.. 150 సీట్లతో జగన్ అభద్రతాభావానికి లోనవుతున్నారని కన్నా వెల్లడించారు.