ఏపీ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. బిశ్వభూషన్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సీ.ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ ప్రమాణస్వీకార సమయంలో రాజ్ భవన్ ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్ నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తొలి గవర్నర్‌గా బిశ్వభూషన్ హరిచందన్‌ను కేంద్రం నియమించింది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీజే, సీఎం జగన్ తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గవర్నర్‌కు అతిథులను పరిచయం చేయనున్నారు.