Bird Flu Effect: నిజమాబాద్ జిల్లాలో బర్డ్ ప్లూ కలకలం.. ఒకే పౌల్ట్రీలో 1500 కోళ్లు మృతి.. అటవీ ప్రాంతంలో పూడ్చివేత

|

Jan 14, 2021 | 1:35 PM

Bird Flu Effect: ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ప్లూ మెల్లగా దక్షణాది రాష్ట్రాలకు కూడా పాకుతోంది. తాజాగా తెలంగాణలోని

Bird Flu Effect: నిజమాబాద్ జిల్లాలో బర్డ్ ప్లూ కలకలం.. ఒకే పౌల్ట్రీలో 1500 కోళ్లు మృతి.. అటవీ ప్రాంతంలో పూడ్చివేత
Follow us on

Bird Flu Effect: ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ప్లూ మెల్లగా దక్షణాది రాష్ట్రాలకు కూడా పాకుతోంది. తాజాగా తెలంగాణలోని నిజమాబాద్‌లో బర్డ్ ప్లూ కలకలం సృష్టిస్తోంది. ఒకే పౌల్ట్రీలో 1500 కోళ్లు మృతిచెంది భయాందోళనలు కలిగిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులో ఉన్న దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటలు గడిచేలోగా 1,500 వరకు కోళ్లు మృతిచెందాయి. రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు.

అయితే మంగళవారం రాత్రి దాదాపు 1000 కోళ్లు చనిపోగా, బుధవారం మరో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయని పౌల్ట్రీ ఫామ్‌ యజమాని వివరించాడు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో మధ్యాహ్నం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం తర్వాత రెండు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు చనిపోయాయి. దీంతో డిచ్‌పల్లి మండల పశువైద్యాధికారి పౌల్ట్రీ ఫామ్‌‌ను సందర్శించారు. చనిపోయిన కోళ్ల రక్త నమూనాలతో పాటు బతికున్న వాటి నమూనాలను సైతం పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు.

Chicken Prices: బర్డ్ ప్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పడిపోతున్న చికెన్ ధరలు.. ప్రస్తుతం కిలో చికెన్ ధర ఎంతంటే..