కేంద్రంపై బీహార్ మంత్రి ఫైర్!

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని కోటాలో ఇరుక్కుపోయిన యూపీ విద్యార్థుల కోసం బస్సులు పంపడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.

కేంద్రంపై బీహార్ మంత్రి ఫైర్!

Edited By:

Updated on: Apr 18, 2020 | 7:37 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని కోటాలో ఇరుక్కుపోయిన యూపీ విద్యార్థుల కోసం బస్సులు పంపడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యూపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తాజాగా బిహార్ మంత్రి అశోక్ చౌదరి కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యోగి ప్రభుత్వం బస్సులను పంపడం చూస్తుంటే బిహార్ ప్రభుత్వం తమ సొంత విద్యార్థులపై అంత శ్రద్ధ చూపడం లేదన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని తీవ్రంగా ఆక్షేపించారు.

కాగా.. వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన విద్యార్థులకు తమ స్వస్థలాలకు తరలించే విషయంలో దేశవ్యాప్తంగా ఒకేరకమైన విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వసల కూలీల విషయంలో కూడా ద్వంద్వ ప్రమాణాలు ఉండరాదని సూచించారు. ‘‘మీరు లాక్‌డౌన్ భావనను తుంగలో తొక్కాలని నిర్ణయించుకుంటే అన్ని నిబంధనలనూ తీసేయండి. ఎవ్వరికీ మినహాయింపులు వద్దు. అందర్నీ అనుమతిద్దాం’’ అని తీవ్రంగా మండిపడ్డారు.