బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ ఓటమి ఖాయమైనట్టే !ఈ విషయాన్ని ఈ పార్టీ అధికార ప్రతినిధి కేసీ.త్యాగి స్వయంగా అంగీకరించారు. కోవిడ్ 19, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దాని తీవ్ర ప్రభావం తమ పార్టీకి దెబ్బగా పరిణమించాయన్నారు. నితీష్ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని చెబుతూనే, మాపార్టీ ఓట్లను చీల్చడంలో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్ జె పీ సక్సెస్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఆయనను కంట్రోల్ చేయలేకపోయిందని, నితీష్ ని నీరు గారేలా చేసేందుకు కమలం పార్టీ ‘ప్రైవేటుగా’ చిరాగ్ ను ఎంకరేజ్ చేసిందని త్యాగి పేర్కొన్నారు.