Breaking News : కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

Bihar BJP MLC Sunil Kumar Singh dies of COVID-19 : కరోనా మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లుగా వైద్యులు తెలిపారు. కొంత కోలుకుంటున్నట్లే కనిపించారని.. అయితే ఒక్కసారిగా గుండె పోటు వచిందని ప్రకటించారు. సునీల్ సింగ్ మరణంపై బీహార్ […]

Breaking News : కరోనాతో బీజేపీ ఎమ్మెల్సీ మృతి

Updated on: Jul 22, 2020 | 1:24 AM

Bihar BJP MLC Sunil Kumar Singh dies of COVID-19 : కరోనా మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లుగా వైద్యులు తెలిపారు. కొంత కోలుకుంటున్నట్లే కనిపించారని.. అయితే ఒక్కసారిగా గుండె పోటు వచిందని ప్రకటించారు.

సునీల్ సింగ్ మరణంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ కూడా సునీల్ మరణంపై సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇప్పటికే కరోనాతో బీహార్‌ మండలి ఛైర్మన్ కు కరోనా పాజిటివ్ అని తేలగా…మరో నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వైద్య పరీక్షలే నిర్వహించి