Bigg Boss 4 Telugu : ఆ ముగ్గురిపై అంత ప్రేమ ఎందుకు బాస్ !

బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు, శత్రువులు మిత్రులుగా మారుతున్నాయి. ఇది హౌస్‌లో ఉన్న అందరికీ వర్తిస్తుంది కానీ....

Bigg Boss 4 Telugu : ఆ ముగ్గురిపై అంత ప్రేమ ఎందుకు బాస్ !

Updated on: Oct 14, 2020 | 4:58 PM

బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా మారుతున్నాయి. ఇది హౌస్‌లో ఉన్న అందరికీ వర్తిస్తుంది కానీ, ఆ ముగ్గురికీ వర్తించడం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టాస్కులకు సంబంధించి వేరు, వేరు టీమ్స్‌గా విడిపోయినప్పుడు కూడా ఆ ముగ్గురు మాత్రం కనిపించని ఐక్యత ప్రదర్శిస్తున్నారు. ఒకరికొకరు మద్దతు తెలుపుకోవడం, బాధను పంచుకోవడం వంటివి చేస్తున్నారు. వీరిలో ఎవరైనా సంచాలకుడిగా వ్యవహరిస్తే ఏకపక్ష నిర్ణయాలు వస్తున్నాయన్న అనుమానాలు మొదలయ్యాయి.  ఇంతకీ ఆ ముగ్గురు సోహైల్, మెహబూబ్, అఖిల్. అవును కాస్త నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది అంటున్నారు కొందరు వీక్షకులు. ఇక కాస్త పరిణామాలు కూడా వారికే అనుకూలంగా ఉంటున్నాయన్నది వారి వాదన. రెస్టారెంట్ కాయిన్స్ టాస్క్ నాటకీయ పరిస్థితుల్లో ముగియడం, అక్కడ కెప్టెన్ రోస్‌లోకి సోహైల్ రావడం, ఆపై అతడు విన్నవడం చకచకా జరిగిపోయాడు. ఇక రోబో-హ్యూమన్  టాస్క్ సందర్భంగా స్మార్ట్ గేమ్ ఆడిన అభిని పొగిడిన హోస్ట్ నాగర్జున, బిబి రెస్టారెంట్ టాస్క్‌లో మాత్రం విమర్శిచడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నాటకీయత గురించి ఎంత చెప్పినా తక్కువే. హౌస్ సభ్యులతో సగం మంది మెహబూబ్‌ను నామినేట్ చేశారు. చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కెప్టెన్‌గా సోహైల్ సేవ్ చేసే అవకాశం లభించనప్పుడు కచ్చితంగా మెహబూబ్‌నే చేస్తాడు. అక్కడ అదే జరిగింది. మరి ఈ తరహా సాఫ్ట్ కార్నర్ సంకేతాలు ఇస్తూ, బిగ్ బాస్ ఎటువంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక వన్ బై  వన్‌గా మహిళలను ఇంటి నుంచి బయటకు పంపించడం కూడా షో చూసేవారికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

Also Read :

హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు

ఇక్కడ గుట్కా సీజ్, అక్కడ సచిన్ జోషి అరెస్ట్, లింకేంటంటే..!