Breaking News
  • అమరావతి: ఏపీ జర్నలిస్ట్‌ అక్రిడేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ. 2 వారాల్లో అక్రిడేషన్ల పునరుద్ధరణ చేయాలని ఆదేశం. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా .
  • రేపు వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన. ఉ.9కు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో పర్యటించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్‌ప్రేమ్‌నగర్‌.. నరేంద్రనగర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి. సా.5గంటలకు జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిశీలన.
  • అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు. కర్నాటక లోకాయుక్తలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో.. కర్నాటక అధికారులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేదని ప్రశ్న . చట్టం మీ చేతుల్లో ఉందని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా. బీఎస్‌3 కన్నా ముందున్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. చట్టం తమ చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం-తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.
  • విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి, దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం-వెల్లంపల్లి.
  • హైదరబాద్: వరదల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, డూప్లికేట్‌ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు-ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌.
  • అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. -అమరావతి వాతావరణ కేంద్రం.
  • తుళ్లూరు రిటైర్డ్‌ తహశీల్దార్‌ సుధీర్‌బాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో సుధీర్‌బాబు పిటిషన్‌. సుధీర్‌బాబుతో పాటు విజయవాడకు చెందిన సురేష్‌ అరెస్ట్‌.

ఇక్కడ గుట్కా సీజ్, అక్కడ సచిన్ జోషి అరెస్ట్, లింకేంటంటే..!

ఈ ఏడాది మార్చిలో  భారీ మొత్తంలో గుట్కాను సీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Actor Sachin Joshi arrested, ఇక్కడ గుట్కా సీజ్, అక్కడ సచిన్ జోషి అరెస్ట్, లింకేంటంటే..!

ఈ ఏడాది మార్చిలో  భారీ మొత్తంలో గుట్కాను సీజ్ చేసిన హైదరాబాద్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే  వారిని విచారించగా.. గుట్కా తరలింపు వ్యవహారంలో ఆశ్యర్యకరంగా ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి పేరు తెరపైకి వచ్చింది. దీంతో హైదరాబాద్ పోలీసులు సచిన్ జోషిపై క్రిమినల్ పీనల్ కోడ్ 41 సెక్షన్ కింద కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీచేశారు. అయితే తాజాగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సచిన్ జోషిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే అతడిని అరెస్ట్ చేసి..తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.( కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య ! )

“ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో 80 గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకున్నాం. మార్కెట్ లో వీటి విలువ లక్షల్లో ఉంటుంది. విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో అతనిపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదైంది. లుకౌట్ నోటీసుల జారీ చేశాం. అతడు ముంబై ఎయిర్ పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నాం” అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ( హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్‌: 3 రోజులు బయటకు రావొద్దు )

Related Tags