బిగ్ బాస్ 4: ఈ వారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి మోనాల్ ఔట్.?

|

Nov 21, 2020 | 2:04 PM

బిగ్ బాస్ 4 చివరి అంకానికి చేరుకునేసరికి రసవత్తరంగా మారింది. 11వ వారం ఎలిమినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 4: ఈ వారం ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి మోనాల్ ఔట్.?
Follow us on

Bigg Boss 4: బిగ్ బాస్ 4 చివరి అంకానికి చేరుకునేసరికి రసవత్తరంగా మారింది. 11వ వారం ఎలిమినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారం ఎలిమినేషన్‌కు అభిజిత్, హారిక, అరియానా, లాస్య, మోనాల్, సోహైల్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ వీక్ ఓటింగ్ ప్రాసెస్ శుక్రవారంతో ముగిసింది. ఇక కంటెస్టెంట్ల వారీగా ఒకసారి పరిశీలిస్తే.. అభిజిత్, సోహైల్, అరియానాలు సేఫ్ జోన్‌కు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పటిలానే అభిజిత్ ఫ్యాన్స్ ఈసారి కూడా తమ కంటెస్టెంట్‌కు  భారీ ఓటింగ్ వేసి అగ్రస్థానంలో నిలబెట్టారు. అలాగే సోహైల్, అరియానాలను కూడా వారి పెర్ఫార్మన్స్‌లు చూసి అభిమానులు సేఫ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక హారిక ఎలాగో కెప్టెన్ అయింది కాబట్టి.. ఎలిమినేషన్‌కు నో ఛాన్స్. ఓటింగ్ పరంగా చూసుకుంటే లాస్య, మోనాల్ చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో మోనాల్‌కు అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. మరి మోనాల్ ఈ వీకెండ్ ఎలిమినేట్ అవుతుందా.? లేక లాస్య అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.!