Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సింగరేణి ముద్దు బిడ్డ సోహెల్

|

Dec 24, 2020 | 3:36 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది.

Green India Challenge :  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సింగరేణి ముద్దు బిడ్డ సోహెల్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బిగ్ బాస్ సెకండ్ రన్నర్ సింగరేణి ముద్దుబిడ్డ ఇస్మార్ట్ సోహెల్.
Follow us on

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తాజాగా బిగ్ బాస్4 విన్నర్ అభిజీత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించాడు సోహెల్. అభిజీత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి ఆతర్వాత  సోహెల్ కు, కరాటే కల్యాణికి, హారికలకు ఛాలెంజ్ విసిరాడు. అందులో భాగంగా సోహెల్ ఛాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ లోని ఓ పార్క్ లో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప‌చ్చ‌ద‌నం పెంచ‌డం కోసం కృషి చేస్తున్న సంతోష్ కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంతరం అరియానా, మెహ‌బూబ్, అఖిల్‌ల‌కు గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఇక బిగ్ బాస్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న సోహెల్ త్వరలో ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.