Bigg Boss 4: అవన్నీ గుర్తొచ్చాయి సర్‌ అంటూ హ్యాండ్‌ ఇచ్చిన సుమ

బిగ్‌బాస్‌ 4లోకి అందరి ఫేవరెట్‌, యాంకర్ సుమ వైల్డ్‌ కార్డు ఇస్తుందంటూ ఆమెను పిలిచారు నాగార్జున. దీంతో హౌజ్‌లోని సభ్యులు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు

Bigg Boss 4: అవన్నీ గుర్తొచ్చాయి సర్‌ అంటూ హ్యాండ్‌ ఇచ్చిన సుమ
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2020 | 7:44 AM

Suma Wild Card Entry: బిగ్‌బాస్‌ 4లోకి అందరి ఫేవరెట్‌, యాంకర్ సుమ వైల్డ్‌ కార్డు ఇస్తుందంటూ ఆమెను పిలిచారు నాగార్జున. దీంతో హౌజ్‌లోని సభ్యులు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇక స్టేజ్‌పైకి వచ్చిన సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏం చేద్దాం సర్.. మీరు, మీ కోడలు యాంకరింగ్ చేస్తుంటే నాకు లోపలికి వెళ్లక తప్పడం లేదు అంటూ సెటైర్ వేసింది. ఇక హౌజ్‌లోకి ఒక్కొక్కరినీ ఇమిటేట్ చేస్తూ అదరగొట్టేసింది. అందరి మీద పంచ్‌లు వేసింది. మధ్యలో నాగార్జునను కూడా ఆడుకుంది. ఇక చివర్లో సుమ అయితే హౌజ్‌లోకి వెళ్తావా అని నాగార్జున అడగ్గా.. ఓకే సర్ అని చెప్పింది. ( Bigg Boss 4: అమ్మ రాజశేఖర్ ఎలిమినేటెడ్‌.. కెప్టెన్సీ మెహబూబ్‌కి ఇచ్చేసిన మాస్టర్‌)

ఇక బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లే గేట్లు తెరిచి సుమను పంపారు నాగార్జున. గేట్లు కూడా మూసుకుపోయాయి. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్‌లను కన్ఫెషన్ రూమ్‌ దగ్గరికి వెళ్లి డోర్ తెరిచేవరకు వెయిట్‌ చేయమన్నారు. కానీ మళ్లీ సుమ వేదికపైకి వచ్చారు. ఏమైంది సుమ అని నాగార్జున అడగ్గా.. చిన్న ప్రాబ్లమ్‌ వచ్చింది సర్‌. ఎంటర్ అవుదామనే అనుకున్న సమయంలో వైల్డ్‌ డాగ్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌, ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్‌ అన్నింటికి సంబంధించిన ప్రెస్‌ మీట్‌లు, ప్రీ రిలీజ్‌లు స్టార్ట్ కాబోతున్నాయని తెలిసింది సర్‌. అవన్నీ వదులుకొని వెళ్లలేను సర్ అంటూ సుమ సమాధానం ఇచ్చారు. ( మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..!)

మరి మా బిగ్‌బాస్‌ హౌజ్‌ని వదిలేస్తావా..? అని నాగార్జున అడగడంతో.. వెళ్తాను కానీ, ఇప్పుడు కాదు సర్. గంగవ్వ వయస్సు వచ్చినప్పుడు లోపలికి వెళ్తాను అని అన్నారు. దీంతో అయితే నెక్ట్స్ ఇయరే అన్న మాట అని నాగార్జున పంచ్ వేశారు. మొత్తానికి సుమ బిగ్‌బాస్‌లో చాలా సందడి చేయగా.. వీక్షకులు కూడా బాగా ఎంటర్‌టైన్ అయ్యారు. ( Qualifier 2: హైదరాబాద్ ఇంటికి.. ఢిల్లీ ఫైనల్స్‌కు..)