అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 చివరి అంకం చేరుకునే సరికి ఆసక్తిగా మారింది. గత వారం మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో ఇంట్లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వారందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లేనని చెప్పవచ్చు. 13వ వారం నామినేషన్‌లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ టాపర్ ఆఫ్ ది హౌస్ అనే టాస్క్ ఇచ్చారు. ఎవరి పొజీషన్ ఏంటో వారే తేల్చుకునేలా సెట్ చేశారు. గార్డెన్ ఏరియాలో వరుసగా నంబర్లు ఉన్న కడ్డీలను పెట్టి ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వారినే తేల్చుకోమని చెప్పారు. దీనితో కంటెస్టెంట్లందరి మధ్య పెద్ద మాటల యుద్ధం చోటు చేసుకుందని చెప్పాలి.
రాహుల్-శ్రీముఖి.. శివజ్యోతి-వరుణ్-వితికలు తారాస్థాయికి చేరేలా గొడవలు పడ్డారు. అంతేకాక ఈ టాస్క్ అనంతరం ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య మాటల కూడా లేవు. ఇది ఇలా ఉంటే శివజ్యోతి.. వరుణ్ విషయంలో చెప్పిన వెర్షన్ కరెక్ట్ అని.. కావాలనే భార్యాభర్తలిద్దరి గొడవను పెద్దది చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. టాస్కులు పరంగా చూసుకుంటే వరుణ్ ఒక స్టెప్ ముందుంటాడు. అంతేకాకుండా గతంలొ వితిక మెడల్ గెలుచుకోవడానికి వరుణ్, రాహుల్, పునర్నవి చాలా సాయం చేశారు. ఈ విషయం మిగిలిన సభ్యులకు కూడా తెలుసు. అదే సంగతిని శివజ్యోతి చెబుతుండగా.. వరుణ్ ఎప్పటిలా కాకుండా కొంచెం తీవ్రంగా స్పందించాడు. ఇక ఇది సరైన తీరు కాదని.. భార్యను వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు అంటున్నారు. అటు బిగ్ బాస్ ఈ వారం అందరిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు. కాగా, ఎప్పటినుంచో ఇంటి నుంచి వితికను బయటికి పంపాలని వెయిట్ చేస్తున్న నెటిజన్లకు దీంతో సరైన అవకాశం దొరికింది. కొందరైతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.