బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: అమరావతి స్టడీస్

| Edited By:

Dec 27, 2019 | 10:49 PM

మూడు రాజధానుల ముచ్చట చెప్పిన జగన్‌ సర్కార్‌, అమరావతిపై తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. జి ఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్‌.. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదిక కోసం వేచిచూడాలని నిర్ణయించింది. జనవరి 3న బీసీజీ నివేదిక వచ్చిన తర్వాత హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో దానిపై చర్చించి, రాజధానిపై తుది నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిపై ఏదో ఒకటి తేల్చేస్తారనే […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: అమరావతి స్టడీస్
Follow us on

మూడు రాజధానుల ముచ్చట చెప్పిన జగన్‌ సర్కార్‌, అమరావతిపై తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. జి ఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్‌.. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ నివేదిక కోసం వేచిచూడాలని నిర్ణయించింది. జనవరి 3న బీసీజీ నివేదిక వచ్చిన తర్వాత హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో దానిపై చర్చించి, రాజధానిపై తుది నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతిపై ఏదో ఒకటి తేల్చేస్తారనే వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో కేబినెట్‌లో ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎన్నివేల కోట్లు ఖర్చుచేసినా అమరావతిని అభివృద్దిని చేయలేమని సీఎం జగన్‌.. తన కేబినెట్‌ సహచరులకు చెప్పినట్లు సమాచారం. లక్ష కోట్లు అమరావతికి ఖర్చుపెట్టే బదులు, అందులో పదో వంతు విశాఖకు ఖర్చుచేసినా, హైదరాబాద్‌ స్థాయి నగరం అవుతుందని సీఎం వివరించారు. అయితే, రాజధాని మార్పు ఎందుకో, ఏమిటో అన్నది ప్రజలకు చెప్పిచేద్దామని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై జనవరి 4న ప్రకటన చేద్దామని కొందరు మంత్రులు చెబితే, హైపవర్‌ కమిటీ నివేదిక చూశాక ప్రకటన చేద్దామని మరికొందరు చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై తొందరేమీ లేదని సీఎం జగన్‌ తేల్చేశారు.

రాజధానిపై ఇప్పటికే మూడు కమిటీలు అధ్యయనాలు చేశాయి. ఒకటి శివరామకృష్ణన్‌ కమిటీ, రెండోది జి ఎన్ రావు కమిటీ. మూడోది బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌. వీటిని అధ్యయనం చేయడానికి మరో కమిటీ- హై పవర్‌ కమిటీ. తాజాగా కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా హైపవర్‌ కమిటీ పరిశీలిస్తుంది. ఇప్పటిదాకా శివరామకృష్ణన్‌, జీఎన్‌ రావు కమిటీలు అటూఇటూగా వికేంద్రీకరణ అన్న అంశం మీదనే ఫోకస్‌ చేశాయి. ఇప్పుడు హైపవర్‌ కమిటీ కొత్తగా చెప్పేందేంటి, ఇందులో మతలబు ఏంటన్నది ఆసక్తిగా మారింది.