నేడు 29 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు శంకుస్థాపన

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యాలయాల శంకుస్థాపన జరగనుంది. ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు జరపనున్నారు. అయితే తొమ్మిది చోట్ల మంత్రులు, మిగితా జిల్లాల్లో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా సిరిసిల్లలో జరిగే కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటివరకూ ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాయాలు ఉన్నాయి. మొత్తం 33 జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా 31 కార్యాలయాలకు స్థలాల […]

నేడు 29 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు శంకుస్థాపన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jun 24, 2019 | 7:15 PM

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యాలయాల శంకుస్థాపన జరగనుంది. ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు జరపనున్నారు. అయితే తొమ్మిది చోట్ల మంత్రులు, మిగితా జిల్లాల్లో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా సిరిసిల్లలో జరిగే కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటివరకూ ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాయాలు ఉన్నాయి. మొత్తం 33 జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అనుగుణంగా 31 కార్యాలయాలకు స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం రెండు దశల్లో భూములను కేటాయించింది. వరంగల్‌, హైదరాబాద్‌లో స్థలాల ఎంపిక జరగలేదు. ఖమ్మం, వనపర్తి మినహా మిగిలిన 29 జిల్లాల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు.