లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన.. బీజేపీ ఎంపీకి జరిమానా..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికి సామాజిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరి. అయితే.. సామాజిక దూరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించిన

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన.. బీజేపీ ఎంపీకి జరిమానా..

Edited By:

Updated on: Jun 05, 2020 | 1:36 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికి సామాజిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరి. అయితే.. సామాజిక దూరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించిన భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగికి నగర పోలీసులు 300 రూపాయల జరిమానా విధించారు. కరోనా ప్రబలుతున్న సమయంలో బీజేపీ ఎంపీ భువనేశ్వర్ నగరంలో మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఎంపీ అపరాజితతోపాటు మరో 20 మంది బీజేపీ సభ్యులపై కేసు నమోదు చేశారు. మాజీ అధికారిణి అయిన అపరాజిత సామాజిక దూరం పాటించకుండా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. కరోనా నిబంధనలను గౌరవిస్తూ తాను స్వచ్ఛందంగా జరిమానా చెల్లించానని ఎంపీ అపరాజిత ట్వీట్ చేశారు. కాగా సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘించిన ఎంపీ అపరాజితపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

[svt-event date=”05/06/2020,12:51PM” class=”svt-cd-green” ]