సివిల్స్‌కు ప్రిపేరవుతున్న భర్త… విడాకులు కావాలంటున్న భార్య…!

| Edited By:

Sep 01, 2019 | 3:54 AM

వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలున్న భార్యాభర్తలు విడాకులు కావాలని కోర్టుకెక్కుతుంటారు. కానీ ఈవిడ మాత్రం తన భర్త పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విడాకులు కావాలని కోర్టుకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కటరా హిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇతనికి గత కొంత కాలం క్రితం వివాహమైంది. అయితే తాను సివిల్స్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు గట్టిగా చదువుతున్నాడు. ఈ […]

సివిల్స్‌కు ప్రిపేరవుతున్న భర్త... విడాకులు కావాలంటున్న భార్య...!
Follow us on

వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలున్న భార్యాభర్తలు విడాకులు కావాలని కోర్టుకెక్కుతుంటారు. కానీ ఈవిడ మాత్రం తన భర్త పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విడాకులు కావాలని కోర్టుకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని కటరా హిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇతనికి గత కొంత కాలం క్రితం వివాహమైంది. అయితే తాను సివిల్స్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు గట్టిగా చదువుతున్నాడు. ఈ క్రమంలో భార్యతో సినిమాలకు, షాపింగ్‌కు వెళ్లేందుకు భర్త సమయం ఇవ్వడం లేదు. ఆ ఆసక్తి కూడా అతనికి లేదు. ఒక్కదానివే సినిమాకు, షాపింగ్‌కు వెళ్లమని చెబుతున్నాడు భర్త. దీంతో విసిగిపోయిన భార్య.. తనకు తన భర్త నుంచి విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు కౌన్సిలర్‌ దంపతులిద్దరిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాడు. అయినప్పటికీ ఇద్దరిలో మార్పు లేదు.

యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమై సివిల్స్‌ సాధించాలన్నది తన చిన్ననాటి కల అని భర్త స్పష్టం చేశాడు. ఉద్యోగం వచ్చే వరకు విశ్రమించనని, సినిమాలకు, షాపింగ్‌లకు దూరంగా ఉంటానని తెగేసి చెప్పాడు. ఇంతకు మించి తమ సంసార జీవితంలో ఎలాంటి గొడవలు లేవు అని భర్త తేల్చిచెప్పాడు. తనకు ఉద్యోగం వచ్చే వరకు సహకరించాలని కోరాడు. అయితే మీ నిర్ణయాలను పునరాలోచించుకోవాలని దంపతులిద్దరికి కౌన్సిలర్‌ సూచించాడు. ఇప్పుడు భర్త కూడా తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ విచారణకు రావడానికి సమయం ఉంది కాబట్టి.. అప్పటి వరకు మరో నాలుగుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కౌన్సిలర్‌ నిర్ణయం తీసుకున్నాడు.