మాకు వేధింపులు కొత్తేం కాదు.. అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తా..!!

| Edited By:

Oct 23, 2019 | 11:35 AM

వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. చిన్న విషయాన్నిపెద్దది చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం.. కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ని ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులు – శ్రీనగర్‌ కాలనీ.. గణపతి కాంప్లెక్స్ దగ్గరున్న నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ – ఇంటి గేటు మూసివేసి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇంటిపైకి ఎలా వస్తారంటూ అఖిలప్రియ […]

మాకు వేధింపులు కొత్తేం కాదు.. అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తా..!!
Follow us on

వ్యాపార లావాదేవీల్లో ఇద్దరి భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని.. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. చిన్న విషయాన్నిపెద్దది చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం.. కేసులో ముద్దాయిగా ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్‌ని ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులు – శ్రీనగర్‌ కాలనీ.. గణపతి కాంప్లెక్స్ దగ్గరున్న నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ – ఇంటి గేటు మూసివేసి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇంటిపైకి ఎలా వస్తారంటూ అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్గవ్‌ను ప్రశ్నించాలంటే ముందు తనను దాటుకొని వెళ్లమంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో గట్టిగా మాట్లాడారు అఖిలప్రియ.

కాగా.. తమను భయబ్రాంతులకు గురిచేసేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే.. తమ కుటుంబానికి హాని చేయాలని చూస్తే.. ఎస్పీ ఫకీరప్పనే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేసింది. ఇప్పటికైనా ఎస్పీ తీరు మార్చుకోవాలని సూచించారు. అవసరమైతే.. దీనిపై గవర్నర్‌కి.. అదీకాకపోతే.. రాష్ట్రపతిని కూడా కలుస్తానని, భయపెడితే.. భయపడే స్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. అయినా.. తమ కుటుంబానికి.. వేధింపులు కొత్తేమీ కాదని చెప్పారు.