Acidity Tips: ఎసిడిటీ సమస్యకు చెక్‌పెట్టే సింపుల్ రెమెడీ.. మీ ఇంట్లోనే ఉంది!

ఈ రకమైన ఆహారం జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీని కారణంగా, ఉదర సమస్యలు తలెత్తుతాయి. దీని కోసం మీరు మీ ఆహారాన్ని మెరుగుపరచుకోవాలి. ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్

Acidity Tips: ఎసిడిటీ సమస్యకు చెక్‌పెట్టే సింపుల్ రెమెడీ.. మీ ఇంట్లోనే ఉంది!
Acidity Problems

Updated on: Jan 26, 2023 | 11:12 AM

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపునొప్పి అందరినీ ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యలు. సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం, పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. ఈ రకమైన ఆహారం జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీని కారణంగా, ఉదర సమస్యలు తలెత్తుతాయి. దీని కోసం మీరు మీ ఆహారాన్ని మెరుగుపరచుకోవాలి. ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

బెల్లం :
ఎసిడిటీ సమస్యను దూరం చేయడానికి బెల్లం ఉపయోగపడుతుంది. బెల్లం జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. బెల్లంలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎసిడిటీ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, బెల్లం మెగ్నీషియంకు మంచి మూలం.

మజ్జిగ :
ఎసిడిటీ సమస్యలకు మజ్జిగ మేలు చేస్తుంది. మజ్జిగ వాడటం వల్ల కడుపు చల్లబడుతుంది. అలాగే, ఇది ప్రోబయోటిక్స్ ఆహారం. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ఆహారంలో మార్పు వల్ల ఎసిడిటీ సమస్య వస్తే మజ్జిగ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. మజ్జిగలో కొన్ని పుదీనా ఆకులను కలుపుకుంటే మరింత ప్రభావం చూపుతుంది.

తులసి ఆకు:
తులసి ఆకులు జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంలో మేలు చేస్తాయి. తులసి ఆకులను రోజూ తీసుకుంటే ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. దీని గుణాలు కడుపుని చల్లబరుస్తాయి. తులసి ఆకులను రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

వేడి నీరు:
వేడి నీటిని తాగడం వల్ల ఎసిడిటీ నుంచి బయటపడవచ్చు. రోజూ పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.

సోంపు నీరు:
సోంపు నీరు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీని కోసం 1 గ్లాసు నీరు తీసుకోండి. దానికి 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. అప్పుడు, ఈ నీటిని తాగండి. దీంతో ఎసిడిటీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..