రికార్డు సృష్టించిన మందుబాబులు..

| Edited By:

Jun 18, 2019 | 10:06 AM

బీర్ విక్రయాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ సంవత్సరం భానుడు తన ప్రతాపాన్ని భారీగా చూపించాడు. నిప్పులు కురిపించి ప్రజలను ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే పరిస్థితి. ఓ వైపు ఉక్కబోత, మరోవైపు దాహం జనం తట్టుకోలేకపోయారు. మరి మందు బాబుల సంగతి చెప్పనవసరం లేదు. రోజు మందు పడకపోతే వారికి పొద్దు […]

రికార్డు సృష్టించిన మందుబాబులు..
Follow us on

బీర్ విక్రయాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత పెరగడంతో బీర్ల విక్రయాలు జోరుగా సాగాయి. ఈ సంవత్సరం భానుడు తన ప్రతాపాన్ని భారీగా చూపించాడు. నిప్పులు కురిపించి ప్రజలను ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే పరిస్థితి. ఓ వైపు ఉక్కబోత, మరోవైపు దాహం జనం తట్టుకోలేకపోయారు. మరి మందు బాబుల సంగతి చెప్పనవసరం లేదు. రోజు మందు పడకపోతే వారికి పొద్దు పోదు. అసలే ఎండ వేడి చంపేస్తుంటే.. మందు తాగే పరిస్థితి ఉండదు. అందుకే బీర్ల మీద పడ్డారందరూ.. ఎన్నడూ లేనంతగా బీర్లను పీల్చేశారు.

తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ లెక్కల ప్రకారం మే నెలలో 61 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయట. ఈ స్థాయిలో బీర్ల అమ్మకాలు ఇదే మొదటిసారని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ నెలలో 53 లక్షల కేసులు అమ్మితే.. మే నెలలో అది 61 కి చేరింది. అసలు 53 లక్షల కేసులే రికార్డు అనుకుంటే.. దానిని మించిపోయింది మే నెల అమ్మకం. ఎండలు బీర్ల సరఫరాపైనా ప్రభావం చూపాయి. నీళ్లు లేకపోవడంతో ప్రొడక్షన్ తగ్గింది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ చేయలేకపోయారు. మెదక్ లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బీర్ల తయారీకి ఇబ్బందులు తలెత్తాయని బీర్ల తయారీ కంపెనీలు చెప్పాయి. తీవ్రమైన నీటి సమస్య ఉండటంతో.. బీర్ల తయారీ కంపెనీలకు నీటి సరఫరా నిలిపివేయాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. దీంతో 30శాతం వరకు నీటి సరఫరా తగ్గిపోయింది. మద్యం దుకాణాల్లో బీర్ల కొరత ఏర్పడింది.