ఐపీఎల్ 14 సీజన్‌కు రెడీ అవుతున్న బీసీసీఐ
ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్‌రేట్‌ల దాగుడుమూతల మధ్య యూఏఈ వేదికగా గత రాత్రి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. ఇక మరో రంగుల పండుగ దగ్గరలోనే ఉంది. ఐపీఎల్ 14 సీజన్ మొదలు కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.
బిగ్ ఈవెంట్.. బిగ్ ఫైట్ ఐపీఎల్ 13వ సీజన్ ముగిసింది. ఎన్నో అవాంతరాలు.. అన్నింటిని దాటుకుని యూఐఈ వేదికగా సందడిగా ముగిసింది. దాదాపు మూడు నెలలపాటు క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని అందించింది. ఎన్నో అనుభూతుల్ని మిగుల్చుతూ ఐపీఎల్ 13వ సీజన్ ప్రశాంతంగా గట్టెక్కింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మరో సీజన్ మొదలు కాబోతోంది.
అయితే 14వ సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను తనవైపుకు తిప్పుకుని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లీగ్ అని పెరు తెచ్చుకుంది. అయితే ఈ ఏడాది మెగా వేలం కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ లీగ్‌కు ముందు మెగా వేలం ఉండనుందట. కొత్త సీజన్ ప్రారంభానికి తక్కువ సమయమే ఉండటం వల్ల అసలు వేలం నిర్వహిస్తారో లేదో అనే అనుమానాలు ఉండేవి. కానీ మెగా వేలంతో వచ్చే సీజన్లో మరింత కిక్ ఇచ్చేందుకు పాలకమండలి సిద్ధమయినట్లు సమాచారం.
కొత్త జట్టు ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నందున పూర్తి స్థాయిలో మెగా వేలానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని ఫ్రాంచైజీలకు బోర్డు సంకేతాలిచ్చిందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు కూడా ఈ వేలంలోకి రానున్నారని తెలుస్తోంది. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 యూఏఈలో జరగ్గా.. వచ్చే సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఫ్యాన్స్‌కు ఎన్నో జ్ఞాపకాల్ని మిగుల్చుతూ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తుదిపోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని మరోసారి ఎగురేసుకుపోయింది. అనేక అనుభూతుల మధ్య ఈ టోర్నీ పూర్తయినా.. త్వరలోనే మళ్లీ మరో సీజన్ ప్రారంభం కానుంది. మార్చి-ఏప్రిల్‌లో ఐపీఎల్ 14వ సీజన్ మొదలవనుంది. ఈ టోర్నీకి ముందు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుంది క్రికెట్ బోర్ట్.