అంజాద్ బాషా స్టేట్‌మెంట్ అదిరింది.. సుప్రీం తీర్పుపై ఏమన్నారంటే ?

ఏపీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత అంజాద్ బాషా కీలకమైన కామెంట్లు చేశారు. అది కూడా దేశం మొత్తమ్మీద చర్చనీయాంశమైన సుప్రీంకోర్టు తీర్పు మీద. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులదేనని, ముస్లింలకు వేరే చోట మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ బాషా స్పందన కోరిన వారితో ఆయన చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఏపీ ముఖ్యమంత్రి […]

అంజాద్ బాషా స్టేట్‌మెంట్ అదిరింది.. సుప్రీం తీర్పుపై ఏమన్నారంటే ?
Follow us

|

Updated on: Nov 09, 2019 | 2:15 PM

ఏపీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత అంజాద్ బాషా కీలకమైన కామెంట్లు చేశారు. అది కూడా దేశం మొత్తమ్మీద చర్చనీయాంశమైన సుప్రీంకోర్టు తీర్పు మీద. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులదేనని, ముస్లింలకు వేరే చోట మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ బాషా స్పందన కోరిన వారితో ఆయన చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించి, హిందూ-ముస్లింలంతా కలిసి మెలిసి వుండాలని, దేశంలో మత సామరస్యం వెల్లివిరిసి, శాంతి భద్రతలు చక్కగా వుండాలని జగన్ ట్వీట్ ద్వారా ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చేసిన కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సుదీర్ఘంగా సాగిన అయోధ్య కేసు విచారణ తర్వాత నిర్ణీత డెడ్‌లైన్‌తో తీర్పు వెలువరిస్తామని సుప్రీం ధర్మాసనం ఆల్‌రెడీ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు కూడా తీర్పు ఎలా వచ్చినా గౌరవిస్తామని చెబుతూనే వున్నారని, ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును తాను కూడా స్వాగతిస్తానని ప్రకటించారు అంజాద్ బాషా. హిందూ, ముస్లింలంతా సోదరులుగా వుంటూ వస్తున్నారని, అదే పరంపరని ఇక ముందు కూడా కొనసాగించాలని ఆయన అన్నారు. మెచ్యూరిటీతో అంజాద్ బాషా చేసిన కామెంట్లు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.